కై లాస్‌నగర్: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధితోపాటు వేలాది మంది కార్మికుల ఉపాధి కల్పనకు తోడ్పడిన ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీ పరిశ్రమ శకం ముగిసింది. ఓ వైపు ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో ఆందోళన కొనసాగుతుండగా, కేంద్రప్రభుత్వం ఫ్యాక్టరీని తుక్కు కింద విక్రయించేందుకు నిర్ణయించే టెండర్ ఆహ్వానించింది. దీంతో కాంట్రాక్టర్లు పరిశ్రమలోని యంత్రాలు, విడిభాగాలు, పరికరాలను తుక్కు కింద విక్రయించేందుకు టెండర్ నిర్వహిస్తున్నారు. సీసీఐ పరిశ్రమకు ఐకానికంగా నిలిచిన భారీ యంత్రాన్ని గురువారం నేలమట్టం చేశారు. బాంబుపేలుళ్లతో భారీ గొట్టం యంత్రాలను ధ్వంసం చేశారు.


