‘వచ్చే ఎన్నికల్లో చింతమనేని రాజకీయ జీవితం ముగిసినట్లే’ | Former TDP Leader Idupuganti Srinivas Slams Chintamaneni Prabhakar | Sakshi
Sakshi News home page

‘వచ్చే ఎన్నికల్లో చింతమనేని రాజకీయ జీవితం ముగిసినట్లే’

Oct 25 2026 4:42 PM | Updated on Oct 25 2026 4:54 PM

Former TDP Leader Idupuganti Srinivas Slams Chintamaneni Prabhakar

సాక్షి,దెందులూరు: స్థానిక సంస్థల ఎన్నికల వేళ దెందులూరు నియోజకవర్గంలో బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయని న్యాయవాది, టీడీపీ మాజీ నేత ఈడుపుగంటి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, వైఫల్యాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దెందులూరులో పోలీస్ వ్యవస్థ, ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమయ్యాయి. వచ్చే 2029 ఎన్నికల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాజకీయానికి ముగింపు పలకడం తథ్యం. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్పడుతున్న కోడిపందేలు, అక్రమ వ్యాపారాల గురించి పార్టీ అధిష్టానానికి తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని శ్రీనివాస్ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement