సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద జేసీ వర్గీయులు హల్ చల్ చేశారు. పెద్దారెడ్డిని చంపుతామంటూ బెదిరింపులకు దిగారు. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. ఇవాళ ఉదయం(ఆదివారం) స్వగ్రామం తిమ్మంపల్లికి పెద్దారెడ్డి వెళ్లారు.
తిమ్మంపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. తిమ్మంపల్లి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా పీఎస్‌లో నిర్భంధించారు. వివరాలు తెలుసుకునేందుకు పెద్దారెడ్డి.. తిమ్మంపల్లి వెళ్లగా.. ఆయన ఇంట్లో లేని సమయంలో ఇంటి వద్ద జేసీ వర్గీయులు గూండాగిరి చేశారు.
ఇదీ చదవండి: కడపలో భారీ కుట్రకు తెరలేపిన కూటమి సర్కార్


