సాక్షి వైఎస్సార్ జిల్లా: జంగిల్ రాజ్ ప్రభుత్వం, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రస్తుతం నడుస్తోందని వైఎస్సార్‌సీపీ నేత పి.రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హిట్లర్‌ను మించిన విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. సామాన్య ప్రజలు సైతం బతికే పరిస్థితి లేదు. ఈ ఎన్నికల్లో వారి అరాచకాలు తారా స్థాయికి చేరాయి’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘దేశమంతా రాష్ట్రంలోని అరాచకాలపై స్పందిస్తున్నారు. చంద్రబాబును విమర్శించడానికి ఇక మాటలు కూడా చాలడం లేదు. అసలే నువ్వు చరిత్ర హీనుడివి.. ఇప్పుడు అంతకంటే దిగజారావు. ఈ ఎన్నికల్లో ఎక్కడ చూసినా గూండాయిజమే. నామినేషన్లు కూడా వేయనివ్వడం లేదు. అధికారుల కళ్ల ముందే అరాచకాలు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. చివరికి మహిళా అభ్యర్థుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు’’ అంటూ రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు.
‘‘మేం అధికారంలో మేము ఇలానే అనుకుని ఉంటే మీ వాళ్లు బయట తిరిగే వారే కాదు. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా మీరు గెలిచారు తప్ప మీకు అంత సీన్ లేదు. సుప్రీం కోర్టు, హై కోర్టు మెట్టికాయలు వేస్తున్నాయని.. ఫేక్ నామినేషన్లు వేసే స్థాయికి మీరు దిగజారారు. చివరికి మీ ఫేక్ చర్యలతో కోర్టులను, ప్రజలను కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ దొంగలు నామినేషన్ సెంటర్లలో పడ్డారు. కడపలో జడ్పీటీసీ స్థానాలకే 14 మంది పేర్లతో ఫేక్ నామినేషన్ వేశారు
..39 జడ్పీటీసీ స్థానాలకు గాను పదుల సంఖ్యలో మా నామినేషన్లు రిజెక్ట్ చేశారు. పై నుంచి వచ్చిన ఒత్తిళ్లు కారణంగా రిజెక్ట్ చేస్తున్నారు. బీహార్ వాళ్ళే అశ్చర్యపోయే విధంగా ఇక్కడ అరాచకాలు చేశారు. పోలీసులు లేకుంటే వాళ్ళంతా పిల్లులు.. మా ముందు నిలబడే సత్తా వాళ్లకు లేదు. జరిగిన అక్రమాలపై మేము అప్పిళ్లకు వెళ్తాం. న్యాయ పోరాటం చేస్తాం. మీరు చేస్తున్న అరాచకాలకు మా ప్రభుత్వంలో మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అంటూ రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి: కడపలో భారీ కుట్రకు తెరలేపిన కూటమి సర్కార్


