బోథ్: ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీలో నెలకొన్న ఇబ్బందులు తక్షణమే పరిష్కరించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. జిల్లాలో గిరిజనులకు కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఎదురవుతున్న అడ్డంకులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సకాలంలో సర్టిఫికెట్లు అందకపోవడం వల్ల గిరిజన విద్యార్థులు, యువత విద్య, ఉద్యోగ అవకాశాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. అర్హులైన వారికి వెంటనే ధ్రువీకరణ పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


