కై లాస్‌నగర్: ఆస్తులకు సంబంధించి ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల(ఎస్‌ఆర్‌ఓ)ను ప్రజల అవసరాలకు అనుగుణంగా మ్యాపింగ్ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కసరత్తు చేపట్టాలని ఆదేశిస్తూ రాష్ట్ర స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా మరో మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటయ్యే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
నియోజకవర్గానికి ఒకటి ఉండేలా..
రిజిస్ట్రేషన్ల శాఖను సాంకేతికంగా అభివృద్ధి చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ఇళ్లు, ప్లాట్లు వంటి ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఇటీవల భారీగా మార్పులు చేసింది. ఇందులో భాగంగా ప్రజలకు రిజిస్ట్రేషన్ల సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు చేపడుతోంది. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎస్‌ఆర్‌వో ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎస్‌ఆర్‌ఓ లోకేషన్ దాని పరిధిలో ఎన్ని మండలాలు వస్తున్నాయి.. వాటికి కార్యాలయం ఎంత దూరంలో ఉందనే వివరాలతో మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించనున్నారు.
ఉమ్మడి జిల్లాలో కొత్తగా మూడు..
ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నాయి.
ఉత్తర్వులు అందాయి
ఎస్‌ఆర్‌వోల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి తదనుగుణంగా చర్యలు చేపడుతాం. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం.
– పి.సంపత్‌కుమార్,
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్


