పత్తి బండ్లు లేక వెలవెలబోతున్న మార్కెట్ యార్డు
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు శనివారం మూడో రోజు కొనసాగాయి. ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ రంగంలో ఉన్నప్పటికీ మద్దతు ధరకు ఎక్కువగా వేలం పాడి ప్రైవేట్ వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టారు. అయితే మొదటి రెండు రోజులు క్వింటాలు ధర రూ.9,260 ఉండగా, మూడోరోజు రూ.60 తగ్గించారు. మొత్తం 41 బండ్లను రైతులు మార్కెట్ యార్డుకు తీసుకొ చ్చారు. 743 క్వింటాళ్లు విక్రయించారు. మధ్యాహ్నం 12 గంటల్లోపే యార్డు పత్తి బండ్లు లేక వెలవెలబోయింది. మూడు రోజులుగా ఇదే పరిస్థితి. అయితే పంట దిగుబడులు సరిగా లేకపోవడంతో రైతులు యార్డుకు తీసుకురావడం లేదని తెలుస్తోంది. కొంతమంది మాత్రం మహారాష్ట్రకు తీసుకెళ్లి వి క్రయిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రైతుల ఇళ్ల వద్దకే మహారాష్ట్ర వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నా రు. యార్డులో మొదటి రోజు 1300 క్వింటాళ్లు, రెండో రోజు 700 క్వింటాళ్లు విక్రయించగా మూడు రోజులు కలిపి మొత్తం 2,743 క్వింటాళ్ల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. ధర తగ్గడంతో రైతులు కొంత నిరాశ చెందుతున్నారు.


