పట్టెడ అవల్‌ ఆలయంలో పూజలు | - | Sakshi
Sakshi News home page

పట్టెడ అవల్‌ ఆలయంలో పూజలు

Oct 26 2026 12:10 AM | Updated on Oct 26 2026 12:10 AM

● వాగులు, గోదావరి తీరం నుంచి తరలింపు

ఖానాపూర్‌: నిర్మల్‌ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌ కు టుంబ సమేతంగా ఆదివారం మహారాష్ట్రలో ని చంద్రపూర్‌ జిల్లా పట్టెడ అవల్‌ ఆలయంలో పూజలు నిర్వహించారు. మొ క్కులు చె ల్లించుకున్నారు. ఖానాపూర్‌ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే వాతావరణ, వ్యవసాయ సవాళ్లను ప్రజలు ధైర్యంగా ఎదుర్కొనేలా, ఆపద సమయాల్లో వారికి అండగా నిలిచే శక్తిని ప్రసాదించాలని వేడుకున్నారు.

దాబాల్లో ఆకస్మిక తనిఖీ

భైంసారూరల్‌: మండలంలోని ఆయా గ్రామాల్లోని దాబాల్లో ఎస్సై సుప్రియ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. యజమానులకు ప లు సూచనలు చేశారు. నేరాల నియంత్రణకు, దాబాల వద్ద జరిగే కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తనిఖీల్లో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా నిరంతరం తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆమె వెంట పోలీసులు ఉన్నారు.

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా?

ఖానాపూర్‌: పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల పరిధిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది. పలికేరువాగు, రెంకొని వాగు, బల్లివాగు, గోదావరి తీరం, అటవీ ప్రాంతాల నుంచి ఇసుక తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈనెల 24న కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ప్రభుత్వ నిర్మాణాలకు ఆమోదిత ఇసుకనే వినియోగించాలని, అక్రమ మార్గాల్లో సేకరణను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించి, అనుమతులు లేకుండా ఇసుక తరలించే వా రిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement