సాత్నాల: జాతీయస్థాయి ట్రాక్ సైక్లింగ్ పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబర్చాలని రాష్ట్ర సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు పి.మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈనెల 30 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో నిర్వహించనున్న 78వ సీనియర్, 55 వ జూనియర్, 41 వ సబ్ జూనియర్ జాతీయ స్థాయి ట్రాక్ సైక్లింగ్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర బాల, బాలికల జట్టుకు హైదరాబాద్లో ఆదివారం సైక్లింగ్ అసోసియేషన్ తరపున జెర్సీలు అందజేశారు. మాజీ సాట్స్ డిప్యూటీ డైరెక్టర్ జి. చంద్రారెడ్డి, ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ మ్యాక్స్వెల్ ట్రివర్, సైక్లింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కాంత్ రావు, కోచ్ లు విజయభాస్కర్ రెడ్డి, పాండు జాదవ్, ధర్మతేజ పాల్గొన్నారు.


