దుబాయ్‌ నుంచి మృతదేహన్ని రప్పించే చర్యలు | - | Sakshi
Sakshi News home page

దుబాయ్‌ నుంచి మృతదేహన్ని రప్పించే చర్యలు

Oct 26 2026 12:10 AM | Updated on Oct 26 2026 12:10 AM

పెంబి: మండలంలోని ఇటిక్యాల్‌ గ్రామానికి చెందిన పాముల రవి దుబాయ్‌లో వారం క్రితం మృతి చెందగా మృతదేహన్ని స్వగ్రామానికి రప్పించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్‌ రాథోడ్‌ విన్నపం మేరకు నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పందించి కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయించారు. ఈమేరకు శనివారం అధికార వైర్‌లెస్‌ సందేశాన్ని జారీ చేసింది. దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌ జనరల్‌, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్యయం చేసుకుంటూ, స్థానిక అధికారుల సహకారంతో రవి మృతదేహన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. మృతదేహం స్వగ్రామానికి త్వరగా తీసుకువచ్చేలా అధికారులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement