పెంబి: బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన జిల్లా వాసి మృతిచెందాడు. పెంబి మండలం ఇటిక్యాల్ గ్రామానికి చెందిన రవి(22) గత 20 నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ పని చేస్తుండగా భవనం పైనుంచి కిందపడి సోమవారం మృతి చెందినట్లు ఫోన్ వచ్చినట్లు రవి బంధువులు, తల్లిదండ్రులు చిన్నక్క, లింగన్న తెలిపారు. కుమారుడి మృతదేహన్ని స్వగ్రామానికి రప్పించాలని గురువారం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని కలిసి కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరగా తీసుకువచ్చేలా కృషిచేస్తానని తెలిపారు. రవి మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


