కై లాస్‌నగర్: స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతోపాటు స్వయం ఉపాధి క ల్పనకు బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలిస్తూ అండగా నిలుస్తోంది. వ్యాపారాలు ప్రారంభించి స్వ యం సమృద్ధి దిశగా ముందడుగు వేసేలా, వారిలో వృత్తి నైపుణ్యాల పెంపునకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకు జిల్లాకు ప్రత్యేకంగా రూ.72లక్షలు కేటాయించింది. అయితే, జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో శిక్షణకు తోడ్పడాల్సిన ఈ నిధులు ల్యాప్స్ అయ్యాయి. ఓ వైపు పలు ప్రభు త్వ శాఖలు నిధుల లేమితో సతమతమవుతుండగా ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన డీఆర్‌డీఏ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా..
ఎస్‌హెచ్‌జీ సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద క్యాంటీన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నిర్వహించేందు కు 18బస్సులను మహిళా సమాఖ్యలకు అందజేసింది. తాజాగా పెట్రోల్ బంక్ మంజూరు చేయగా దాని నిర్మాణ పనులు పూర్తయి రెండు నెలలవుతోంది. బంక్ నిర్వహణతో మహిళా సమాఖ్య ఆర్థికాభివృద్ధి సాధించేందుకు తోడ్పడుతందని సర్కారు భా వించింది. ఇలా ఎస్‌హెచ్‌జీ సభ్యుల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా నిలుస్తుండగా జిల్లా గ్రామీణా భివృద్ధిశాఖ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బంక్ నిర్వహణకు అవసరమైన సి బ్బందికి శిక్షణ ఇచ్చి దాన్ని ప్రారంభించేలా చూడాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో బంక్ అలంకారప్రాయంగా మిగిలింది.
మరోసారి ఇలా జరగనివ్వం
ఎస్‌హెచ్‌జీ సభ్యులకు శిక్షణ, జీవన ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం తొలి క్వార్టర్‌లో నిధులు విడుదల చేసింది. వాటిని ఏ విధంగా వెచ్చించాలనే మార్గదర్శకాలు జారీ చేయనందున ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదు. అందుకే ఆ నిధులు ల్యాప్స్ అయ్యాయి. మరో క్వార్టర్‌లో ఆ నిధులు తిరిగి వచ్చే అవకాశముంది. మరోసారి ఇలా జరగకుండా పక్కా ప్రణాళికతో నిధులు సద్వినియోగమయ్యేలా చూస్తాం. డీపీఎంల పనితీరు మెరుగుపర్చేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం.
– జాదవ్ గోవింద్‌రావు,
సెర్ప్ అడిషనల్ డీఆర్డీవో


