గ్రామీణ ప్రాంతాల్లో సహజసిద్ధంగా లభించే అరుదైన బుడుమ పండ్లు స్థానిక పేద, గిరిజన కుటుంబాలకు సీజనల్ ఉపాధిగా మారాయి. ఉట్నూర్ మండలం బీర్సాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కొలాంగూడలో 10 కుటుంబాలకు చెందిన ఆదివాసీలు ఎకరం విస్తీర్ణంలో ఈ పండ్లను సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఏటా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు వీటి సీజన్ కొనసాగుతుంది. కాయ పరిమాణాన్ని బట్టి రూ.20 నుండి రూ. 50 వరకు విక్రయిస్తున్నారు. రోజుకు రూ.800 నుంచి రూ.1500 వరకు ఆదాయం లభిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్కో కుటుంబం సగటున రూ.25 వేల వరకు సంపాదించినట్లు తెలిపారు.
– ఉట్నూర్‌రూరల్


