దేశీదారు తరలిస్తున్న వ్యక్తి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

దేశీదారు తరలిస్తున్న వ్యక్తి రిమాండ్‌

Oct 2 2026 3:09 AM | Updated on Oct 2 2026 3:09 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన సంపంగి వెంకటరమణ మహారాష్ట్ర నుంచి కారులో అక్రమంగా దే శీదారు తరలిస్తుండగా గురువారం దాడి చేసి పట్టుకున్నట్లు ఎకై ్సజ్‌ సీఐ ఆకుల శ్రీనివాస్‌ తెలిపారు. రూ.44 వేల విలువైన 1100 మద్యం బాటిళ్లు, కారును స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

నకిలీ నంబర్‌ ప్లేట్‌ వినియోగిస్తున్న వ్యక్తి రిమాండ్‌

ఆదిలాబాద్‌టౌన్‌: చలాన్ల నుంచి తప్పించుకునేందుకు వాహనానికి నకిలీ నంబర్‌ప్లేట్‌ వినియోగిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు. గురువారం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఆదిలా బాద్‌ పట్టణంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించిన తాటిగూడకు చెందిన చౌహాన్‌ చంద్రశేఖర్‌ను విచారించగా నకిలీ నంబర్‌ విని యోగిస్తున్నట్లు తేలిందన్నారు.

గంజాయి సాగు చేస్తున్న ఇద్దరి అరెస్టు

నార్నూర్‌: పత్తి చేనులో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న ఇద్దరిని గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై ఎస్‌.శ్రీసాయి తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఖైర్‌దట్వ గ్రామ శివారులోని వ్యవసాయ భూముల్లో తనిఖీలు చేపట్టగా గ్రామానికి చెందిన పుసం చిత్రు, తొడసం మంగు పత్తి చేలల్లో 8 చొప్పున మొత్తం 16 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాటి విలువ సుమారు రూ.1.60 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను అరెస్టు చేసి వైద్య పరీక్షల అనంతరం ఉట్నూర్‌ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

బెల్లంపల్లి: రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జట్టు ఎంపికై ంది. గురువారం బెల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ సీవోఈ గురుకుల పాఠశాలలో ఉమ్మడి జిల్లా జోనల్‌ స్థాయి చెస్‌ ఎంపిక పోటీలు నిర్వహి ంచారు. అండర్‌–19 విభాగంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారుల్లో డి.రాజు, జె.వంశీ, డి.శశికుమార్‌, బి.అద్విక్‌, శివరామ అంజి, పవన్‌, వరుణ్‌తేజ, ఐ.ధనుంజయ్‌ ఉన్నట్లు ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ బి.బాబురావు, ప్రిన్సిపాల్‌ ఆకిడి విజయసాగర్‌ తెలిపారు. సదరు విద్యార్థులను ఉమ్మడి జిల్లా చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కనకయ్య, పీఈటీలు అల్లూరి వామన్‌, ముత్యకుర్తి రాజశేఖర్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

సోయా @ రూ.6,100

భైంసారూరల్‌: భైంసా డివిజన్‌ వ్యాప్తంగా నా లుగైదు రోజులుగా సోయా కోతలు ప్రారంభమయ్యాయి. గురువారం భైంసా మార్కెట్‌లో క్వింటాలు సోయాకు రూ.6,100 వరకు ధర పలికింది. రూ.5,600 నుంచి రూ.6,100 వరకు ధర చెల్లించి పంట కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం రూ.5,708 మ ద్దతు ధర ప్రకటించింది. ప్రైవేటులో ధర పె రగడంతో రైతులు కాస్త సంబరపడుతున్నా రు. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌లో క్వింటా లుకు రూ.6,300 వరకు ధర పలుకుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement