ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అందని వేతనాలు ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల గెస్ట్ లెక్చరర్ల అవస్థలు శాశ్వత పరిష్కారం కోరుతున్న అతిథి అధ్యాపకులు
నిర్మల్‌ఖిల్లా: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులు వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా సేవలు అందిస్తున్నా వేతనాల చెల్లింపులో జాప్యం, ఉద్యోగ భద్రత లేకపోవడం, ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభంలో పునర్నియామక ప్రక్రియ వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 13 డిగ్రీ కళాశాలల్లో 160 మందికి పైగా అతిథి అధ్యాపకులు కన్సాలిడేటెడ్ గౌరవ వేతనం రూ.28 వేలపై విధులు నిర్వహిస్తున్నారు. అది కూడా నెలలో ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులకే ఇస్తున్నారు. విద్యా సంవత్సరం మొదలైన 12 నెలలపాటు పనిచేసేలా అతిథి అధ్యాపకులను నియమించాలి. ఏడాది పొడవునా పనిచేస్తున్నా కొన్ని నెలలకే వేతనాలు చెల్లిస్తున్నారు.
ప్రతీ ఏడాది ఇదే తంతు...
అతిథి అధ్యాపకుల నియామకం ఏటా కొత్తగా చేపట్టడం వల్ల అనిశ్చితి నెలకొంటోంది. గతంలో పనిచేసిన వారిని కొనసాగించే విధానం అమలు చేయాలని కోరుతున్నారు. ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ సిబ్బంది సేవలను రెన్యువల్ చేసినా గత ఏప్రిల్ నుంచి వేతనాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెల 1న వేతనాలు అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొంటుండగా వీరికి మాత్రం ఇది కలగానే మిగిలింది. సకాలంలో జీతం అందక ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, కుటుంబ ఖర్చులు, రోజువారీ వ్యయాలకు ఇబ్బంది పడుతున్నారు. దసరా పండుగ సమీపిస్తుండడంతో ఇప్పటికై నా నాలుగు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లా వివరాలు


