కై లాస్‌నగర్: తల్లిదండ్రులు, వయోవృద్ధులను నిరా దరణకు గురిచేస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి జీతం నుంచి ఆ టోమేటిక్‌గా కోత విధించి నేరుగా వారికి అందించేలా చర్యలు తీసుకుంటామ ని తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా వయోవృద్ధులు నేరుగా తనకు దరఖాస్తు చేసుకోవచ్చని భరోసానిచ్చారు. అనంతరం వయోవృద్ధులను శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అంతకుముందు వైద్యశిబిరాన్ని ప్రా రంభించారు. ఏఎంసీ చైర్మన్ బొరంచు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, వయోవృద్ధుల సమాఖ్య ప్రతినిధి దేవిదాస్ దేశ్‌పాండే తదితరులున్నారు.
ఆధార్ నమోదు తప్పనిసరి
పాఠశాల విద్యార్థుల ఆధార్ నమోదు తప్పనిసరి అని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆధార్ అప్‌డేట్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. బయోమెట్రిక్ అప్‌డేట్ వివరాలు పరిశీలించారు. ఇప్పటివరకు ఆధార్ కార్డులేని వి ద్యార్థులపై ప్రత్యేకదృష్టి సారించి వెంటనే నమోదు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. డీఈవో మాధ వి, పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ఆధార్ కన్సల్టెంట్ ప్రవీణ్‌కుమార్, ఆధార్ మ్యాన్‌పవర్ ఏజెన్సీ డైరెక్టర్ విలాసిత, ప్రాజెక్ట్ మేనేజర్ లక్ష్మణ్, జిల్లా కోఆర్డినేటర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో అలసత్వం వద్దు
ఆదిలాబాద్‌టౌన్: విధులను నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షిషా హెచ్చరించారు. రిమ్స్ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆడిటోరియంలో అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. రిమ్స్ ఆస్పత్రిలో వైద్యసేవలు మరింత మెరుగుపరచడంతోపాటు నిర్వహణ లోపాలను సరిది ద్దేందుకు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూ చించారు. అనధికారిక ప్రవేశాలను అరికట్టేందుకు గత పాస్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని తె లిపారు. పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. 420 మందికి 350 మంది మాత్రమే విధుల కు హాజరవుతున్నారని తెలిపారు. మిగతా 70 మంది గైర్హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కేటాయించిన రూ.11కోట్లతో ట్రాన్స్‌ఫార్మర్, లిఫ్టులు, ఇతర మరమ్మతు పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ఉద్యోగు ల ఈపీఎఫ్, ఈఎస్‌ఐ బకాయిలను డిసెంబర్ 3లో పు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో సాధ న, డీపీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత తదితరులున్నారు.


