ఆర్టీసీలో ఎన్నికల వేఢీ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో ఎన్నికల వేఢీ

Oct 2 2026 3:15 AM | Updated on Oct 2 2026 3:15 AM

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం

పెండింగ్‌ వేతన సవరణలు అమలు చేయడం

ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు, ప్రయోజనాలు

బకాయి వేతనాలు, పీఎఫ్‌, కోఆపరేటివ్‌ బకాయిల చెల్లింపు

కార్మిక సంఘాలపై ఉన్న ఆంక్షల తొలగింపు, యూనియన్‌ హక్కుల పరిరక్షణ

ఉద్యోగ భద్రత, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చర్యలు

ఖాళీ పోస్టుల భర్తీ, ఉద్యోగుల సంఖ్య పెంచడం

సిబ్బందిపై పనిభారం తగ్గించడం

కొత్త బస్సుల కొనుగోలు ద్వారా సంస్థను బలోపేతం చేయడం

యూనియన్‌ అగ్రనేతల రాకతో హోరెత్తిన ప్రచారం కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు ఓట్లు చీలకుండా ఐక్యంగా ఎన్నికల బరిలో..

మంచిర్యాలఅర్బన్‌/ఆదిలాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్‌ఆర్టీసీ)లో సుదీర్ఘ కాలం తర్వాత గుర్తింపు సంఘం (యూనియన్‌) ఎన్నికలు జరుగుతుండడంతో కార్మికుల్లో ఉత్సాహం నెలకొంది. పదేళ్ల విరామం తర్వాత ఎన్నికలు జరుగుతుండడంతో కార్మిక సంఘాలన్నీ ప్రచార పర్వంలో మునిగిపోయాయి. 2016లో చివరిసారిగా ఎన్నికలు జరగగా, 2018లో ఎన్నికలు నిర్వహించలేదు. 2019లో కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం యూనియన్లను రద్దు చేసి వెల్ఫేర్‌ బోర్డులను ఏర్పాటు చేసింది. దీంతో అప్పటి నుంచి కార్మిక సంఘాలు నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. తాజాగా కార్మికశాఖ ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేయడంతో మళ్లీ యూనియన్ల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితా ఖరారు కాగా, బరిలో నిలిచే సంఘాలకు ఎన్నికల గుర్తులను సైతం కేటాయించారు. ఆదిలాబాద్‌ రీజియన్‌లో 1773 మంది ఓటర్లు ఉన్నారు. ఆక్టోబర్‌ 9న ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరుగనుంది. అక్టోబర్‌ 14, 15 తేదీల్లో ఆన్‌డ్యూటీ సిబ్బంది కోసం పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహించి 17న ఫలితాలు ప్రకటించనున్నారు.

కూటమిగా పోటీ..

ఆర్టీసీ ఎన్నికల్లో 12 సంఘాలకు గుర్తులు కేటాయించినప్పటికీ కొన్ని సంఘాలు మాత్రమే బరిలో నిలుస్తున్నాయి. ఎస్‌డబ్ల్యూఎఫ్‌, ఎస్‌డబ్ల్యూయూ (ఐఎన్టీయూసీ), టీడబ్ల్యూయూ మహాకూటమిగా జట్టుకట్టిన టీడబ్ల్యూయూ బ్యానర్‌ బాణం గుర్తుపై పోటీలో నిలిచాయి. టీఎంయూ (నిచ్చెన) ఎన్‌ఎంయూ (కాగడ), ఎంప్లాయీస్‌ యూనియన్‌ (బస్సు) కూటమిగా జతకట్టాయి. రాష్ట్రస్థాయిలో ఈయూ, డిపో వైజ్‌గా టీఎంయూలు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాయి. మునుపెన్నడూలేని విధంగా నాలుగు సంఘాలు కూటమిగా మరో మూడు సంఘాలు మరోకూటమిగా ఒకేతాటిపైకి రావడంతో ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురుకానుంది. ఇప్పటికే ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఈదురు వెంకన్న, టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏఆర్‌రెడ్డి రీజియన్‌ వ్యాప్తంగా చుట్టివెళ్లారు. టీడబ్ల్యూయూ నుంచి రాష్ట్ర కార్యదర్శి అశ్వథ్థామరెడ్డి మంచిర్యాల డిపో రాకతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.

న్యూట్రల్‌ ఓటర్లపై యూనియన్ల గురి

ఆర్టీసీలో దాదాపు పదేళ్ల తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలకు శంఖారావం మోగడంతో యూనియన్ల నాయకులు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే తమ యూనియన్లలో ఉన్న సభ్యులను సమీకరించుకుంటూనే, ఏ యూనియన్‌లోనూ లేని న్యూట్రల్‌ కార్మికులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వారిని తమవైపు తిప్పుకునేందుకు ఆకర్షణీయమైన హామీలను ఇస్తూ మద్దతు కోరుతున్నారు. న్యూట్రల్‌ కార్మికుల ఓట్లు కీలకంగా మారడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నాయి.

సంఘాల హామీలివే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement