చిన్నారికి అండగా.. | - | Sakshi
Sakshi News home page

చిన్నారికి అండగా..

Sep 28 2026 1:29 AM | Updated on Sep 28 2026 1:29 AM

అభిమాన్యు వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా రూ.82,200 ఆర్థికసాయం రూ.45 వేల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌.. ఆవు, లేగదూడ అందజేత

నార్నూర్‌: తల్లిని కోల్పోయిన చిన్నారికి అండగా నిలిచారు గోండ్వాన పంచాయతీ రాయి సెంటర్‌ పెద్దలు, అభిమాన్యు వాట్సాప్‌ గ్రూప్‌ సభ్యులు. గాదిగూడ మండలం హిరాపూర్‌కు చెందిన ఆత్రం కవిత జంగు రిమ్స్‌లో మూర్ఛ వ్యాధితో చికిత్స పొందుతూ పాపకు జన్మనిచ్చి మృతిచెందింది. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటాన్ని గుర్తించిన అభిమాన్యు గ్రూప్‌ సభ్యులు ఆపన్నహస్త అందించాలని పిలుపునిచ్చారు. దాతలు రూ.82,200 విరాళాలు సేకరించారు. జూగ్నక్‌ భీంరావ్‌ సర్మేడి (గాదిగూడ), మందాడి దౌలత్‌రావు సర్మేడి (ఝరి) తదితరుల చేతుల మీదుగా ఆదివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. పాపకు ‘రక్షణ’గా నామకరణం చేశారు. ఈ మొత్తంలో రూ.45 వేలతో పాప పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, రూ.27 వేలతో ఆవు, లేగదూడ, రూ.5 వేలతో వైద్య అవసరాల కోసం జమ, రూ.5,200 నగదు అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన దాతలు, సహకరించిన ఎంఎన్‌ఆర్‌ టీమ్‌కు అభిమాన్యు గ్రూప్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకులు, సామాజిక కార్యకర్త మెస్రం శేఖర్‌బాబు, పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘం గాదిగూడ మండల అధ్యక్షుడు మెస్రం లింగు, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందూర్‌ సంతోష్‌, మాజీ సర్పంచ్‌ మాడవి జాకు, జైభారత్‌ మండల నాయకులు గంగారాం తదితరులు ఉన్నారు.

ఆవు, లేగదూడ అందజేస్తున్న ఆదివాసీ పెద్దలు, అభిమాన్యూ గ్రూప్‌ సభ్యులు

ఆర్థికసాయం అందిస్తున్న అభిమాన్యు వాట్సాప్‌ గ్రూప్‌ సభ్యులు, ఆదివాసీ పెద్దలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement