వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన 12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్– 14, 16, 18, 20 బాలబాలికలు, మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో జరిగిన పోటీల్లో 1500 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 220 ఈవెంట్లను నిర్వహించినట్లు వరంగల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఊర యుగేంధర్‌రెడ్డి తెలిపారు. నువ్వానేనా అన్నట్లు పోటీపడగా 111 పాయింట్లతో భద్రాద్రి కొత్తగూడెం ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది.
బాలికల విభాగం..
అండర్–14 విభాగంలో 15 పాయింట్లతో హనుమకొండ అథ్లెట్లు, అండర్–16 విభాగంలో 27 పాయింట్లతో హైదరాబాద్, అండర్–18 విభాగంలో 22 పాయింట్లతో భద్రాద్రి కొత్తగూడెం, అండర్–20లో 28 పాయింట్లతో భద్రాద్రి జిల్లా అథ్లెట్లు విజేతలుగా నిలిచారు. సీనియర్ ఉమెన్ కేటగిరీలో 18 పాయింట్లతో ఖమ్మం జిల్లా అథ్లెట్లు విజేత ట్రోఫీని అందుకున్నారు.
బాలుర విభాగం..
అండర్–14 విభాగంలో 11 పాయింట్లతో ఆది లాబాద్, అండర్–16 విభాగంలో 10 పాయింట్లతో హనుమకొండ, అండర్–18 లో 20 పాయింట్లతో హైదరాబాద్, అండర్–20 కేటగిరీలో 36 పాయింట్లతో రంగారెడ్డి, సీనియర్ మెన్ చాంపియన్‌షిప్‌ను 32 పాయింట్లతో ఖమ్మం ట్రోఫీని అందుకుంది.


