ఆదిలాబాద్‌టౌన్: ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్‌కుమార్‌ను వెంటనే తొలగించాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని మార్చేసిందని పేర్కొన్నారు. 17 కోట్లకు పైగా ఓట్లను కమిషనర్ తొలగించారని ఆరోపించారు. సుప్రీంకోర్టు జడ్జి, ప్రధాని, రాష్ట్రపతి, ప్రతిపక్ష నేత కమిషనర్‌ను ఎన్నుకునే విధానం ఉండేదని, మోదీ పీఎం అయ్యాక అనుకూలంగా ఉన్నవారిని నియమించుకున్నారని ఆరోపించారు. కమిషన్‌లో ఉన్న ఇద్దరు సభ్యులు 14 సార్లు కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రివర్గ కమిటీకి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ముందు కేంద్ర హోంశాఖమంత్రి జిల్లా కేంద్రానికి వచ్చినప్పుడు ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపిస్తే సీసీఐని పునఃప్రారంభిస్తారని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వెంటనే సీసీఐని పునఃప్రారంభించాలని లేకపోతే ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో పెన్షనర్స్ సంఘం అధ్యక్షుడు శశికాంత్, దయాకర్‌రెడ్డి, గంగాధర్, లోకారి పోశెట్టి, కొండ రమేశ్, ఈశ్వర్ పాల్గొన్నారు.


