కాసిపేట: భర్త మరో మహిళతో డ్యాన్స్ వేయడాన్ని తట్టుకోలేక ఈనెల 24న మండలంలోని దే వాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో దొడ్డిగూడకు చెందిన రాయిసిడాం సంధ్య(23) ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త మరోమహిళతో సంబంధం పెట్టుకుని సోదరి సంధ్యను వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడిందని గణేశ్ ఫిర్యాదు చేశారు. గతంలో ఓ పెళ్లిలో సదరు మహిళతో చనువుగా ఉండి డ్యాన్స్ చేయడం, బావ సిడాం జంగును కొట్టి మందలించినట్లు తెలిపారు. పద్ధతి మార్చుకోకుండా వేధింపులకు పాల్పడుతుండటం, గణేశ్ నిమజ్జనం ఊరేగింపులో మహిళతో డ్యాన్స్ చేస్తూ ముద్దులు పెడుతూ, పులిహోర తినిపించడంతో తట్టుకోలేక సంధ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. బాధలో ఏం తోచలేదని పక్కన ఉన్నవారు చెప్పినట్లు ఫి ర్యాదుకు అంగీకరించామని, ఈ విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.


