ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో శిశువులను కాపాడిన క్ర మంలో అస్వస్థతకు గురైన స్టాఫ్‌నర్స్ ప్రమీల ఆరో గ్య పరిస్థితి విషమించింది. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఊపిరితిత్తుల్లో నీరు నిల్వ కావడం, కెమికల్స్‌తో లీ వర్‌పై ప్రభావం చూపిందని వైద్యులు పేర్కొన్నా రు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఎమ్మెల్యే పాయల్ శంకర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, దళితశక్తి ప్రోగ్రాం కన్వీనర్ గణేశ్‌తోపాటు పలువురు పరామర్శించారు.
సాహిత్య సేవ గొప్పది
ఆదిలాబాద్‌టౌన్: ఉదారి కుటుంబం చేస్తున్న సాహిత్య సేవ చాలా గొప్పదని పలువురు కవులు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం ఉదారి నాగదాసు స్మారక కవిత పురస్కారాన్ని మునిమడుగుల రాజారావుకు అందజేశారు. ప్రశంసపత్రంతో పాటు రూ.5వేల నగదు అందించారు. కవులు సామల వీరన్న, బాలసాని నారాయణ గౌడ్, మన్నె ఏలియా, డైట్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, ఉదారి నారాయణ, తొడసం చందు, చిందం ఆశన్న తదితరులు పాల్గొన్నారు.


