పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కొలువుదీర్చిన మట్టి గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనోత్సవ శోభాయాత్రను ప్రారంభించారు. ఆనవాయితీని పాటిస్తూ ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయ ల్ శంకర్, ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష తదితరులు ఆది దేవుడికి పూజలు చేశారు. భక్తులు, ప్రజలు సమన్వయంతో నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతా వరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు. ప్రధాన వక్త మిరాశీ ప్రకాశ్ మాట్లాడుతూ, సమష్టి భాగస్వామ్యంతోనే హైందవ ధర్మ పరిరక్షణకు మరింత బలం చేకూరుతుందని అన్నారు.


