● ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ప్రధానంగా రైతును కంటిమీద కునుకు లేకుండా చేసింద ని గుర్తించాను.అందుకే నాతోపాటు వరుణుడి ని వెంటపెట్టుకొచ్చా. మీరు స్వయంగా సాగు చేసి పూజలో నాకు సమర్పించిన వస్త్రం బాగా నచ్చింది. ఈసారి తెల్లబంగారం దిగుబడి కొంత తగ్గినా మద్దతు ధర కష్టాలుండవని దీవిస్తున్నా. శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికా రుల సూచనలు పాటించండి. అంతా మంచే జరుగుతుంది.
● సర్కారు కొలువు కోసం ఎదురుచూస్తున్న యువత మీ ప్రయత్నాలు ఆపకండి. నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగండి. ఇప్పటికే పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందని విన్నా. పట్టుదలతో సన్నద్ధమవ్వండి. విజయం సాధించండి. ఉద్యోగం రాకున్నా నిరాశ పడకండి. స్వయం ఉపాధి వైపు దృష్టి సారించండి. ప్రభుత్వ పథకాల ద్వారా సొంతంగా ఎదగండి. మీతో పాటు పది మందికి ఉపాధి కల్పించండి. మీకు నేనున్నా.. అభయమిస్తున్నా. ఆల్ ది బెస్ట్.
● దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని మీకు తెలిసిందే.విద్యార్థుల్లారా.. చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణ తో ముందుకు సాగండి. ఈ రోజు మీరు పడే కష్టం.. రేపటి విజయానికి బాటలు వేస్తుంద ని గుర్తుంచుకోండి. 20 ఏళ్లు శ్రమిస్తే 80 ఏళ్లు సు ఖంగా ఉంటారని నమ్మండి. ప్రణా ళికాబద్ధంగా ముందుకు సాగి మీ లక్ష్యాలను నెరవేర్చుకోండి. కన్నవారు, గురువులు గర్వపడేలా ఎదగండి.
● చెమట చుక్కతో కుటుంబాలను పోషిస్తున్న కార్మికుల్లారా.. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోవద్దు. నిజాయతీగా పనిచేస్తూ ముందుకు సాగండి. మీ పిల్లలు ఉన్నతంగా ఎదిగేలా చూడండి. వారికి కష్టం విలువ చెబుతూ ప్రోత్సహించండి. మీకంతా మంచే జరుగుతుందని ఆశీర్విదిస్తున్నా.
● ఆకాశంలో స గం.. అవనిలో సగమైన మహిళా భక్తులారా.. తీరొ క్క పూజలతో నన్ను కొలిచిన తీరు నచ్చింది. భక్తితో మీరు సమర్పించిన నైవేద్యాలు నా బొజ్జ నింపాయి. మీ ఇంటిల్లి పాది సుఖ శాంతులతో ఉండాలని దీవిస్తున్నా. మీరు కూడా నా మాటగా ఒకటి వినండి. ఇంటికే పరిమితం కాకుండా సమాజాభివృద్ధిలోనూ మార్కు చూపండి. స్వయం సమృద్ధి దిశగా ముందడుగు వేయండి. నాణ్య త, నిజాయితీ, పట్టుదలతో మీ కృషికి తగిన ఫలితం దక్కేలా నా ఆశీస్సులు ఉంటాయి.
కై లాస్‌నగర్: భక్తులారా.. 11 రోజుల పాటు నన్ను మనసారా కొలిచారు. వ్రతాలు, అభిషేకాలు, కుంకుమా ర్చనలు, భజనలతో నిత్య పూజలతో వేడుకున్నారు. మీ మొక్కులు విన్నాను.. ఇక్కట్లను దగ్గరుండి చూశాను.. కోరికలనూ ఆలకించాను.. అధైర్యపడకండి.. ఎల్లవేళలో మీకు అండగా ఉంటా.. ఆది దేవుడిగా అభయమిస్తున్నా..అంటూ ఆయా వర్గాలకు తన చల్లని దీవెనలు, ఆశీస్సులందిస్తూ విఘ్నేశ్వరుడు శుక్రవారం గంగమ్మ ఒడికి చేరాడు.
దీవెనలు.. ఆశీస్సులివే
ఇక ఉండనా మరి.. 11 రోజులవుతంది వచ్చి. అమ్మ(పార్వతమ్మ) పిలుస్తుంది. గంగమ్మ చెంతకు చేరే సమయం ఆసన్నమైంది..సెలవిస్తే వెళ్తా మరి.. వచ్చే ఏడాది మళ్లీ కలుస్తా.
మీ గణేశుడను..
ప్రభుత్వ ఉద్యోగులారా.. మీరే నా ఆత్మీయ సేవకులు. 11 రోజుల పాటు ఎంత నిష్టతో పూజ చేశారో చూశాను. నాకు నచ్చింది. మీకు అంతా మంచే జరగాలని దీవిస్తున్నా. అయితే నా మాటగా ఒకటి చెబుతున్నా వినండి. మీ వద్దకు వచ్చే ప్రజల సమస్యలను ఓపిగ్గా ఆలకించండి. సామాజిక బాధ్యతగా విధులు నిర్వహించండి. వారి కష్టాలు తీరేలా మీ వంతు చొరవచూపండి. ఆ కృతజ్ఞతతో మీకు సంతృప్తి దక్కుతుంది.. నాకూ ఆనందం కలుగుతుంది. అలాగే మీ న్యాయమైన డిమాండ్లు, కోరికలు కూడా విన్నాను. ప్రభుత్వం త్వరలోనే మీకు గుడ్ న్యూస్ చెప్పేలా చూస్తాను. ఇక నుంచి ఎక్కడా మీపై అపవాదు రావద్దు. మరీ మరీ చెబుతున్నా గుర్తుంచుకోండి.