కొనసాగుతున్న విచారణ | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న విచారణ

Sep 26 2026 12:14 AM | Updated on Sep 26 2026 12:14 AM

● ప్రమాద ఘటనపై ఆరా తీసిన ఐటీడీఏ పీవో

ఆదిలాబాద్‌టౌన్‌: ఇటీవల జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఎస్‌ఎన్‌సీయూ విభాగంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఇందులో భాగంగా శుక్రవారం కమిటీ చైర్మన్‌, ఐటీడీఏ పీవో మంద మకరందు రిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించారు. ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న వైద్యులు, స్టాఫ్‌నర్సులు, సిబ్బంది ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందించిన వైద్యులను పిలిచి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇతర వివరాలపై ఆరా తీశారు. చిన్నారులను అంబులెన్స్‌లో తీసుకెళ్లిన వైద్య సిబ్బందిని, రిమ్స్‌లో ఇతర సిబ్బందిని విచారించారు. రెండో రోజు సైతం డిప్యూటి డీఎంహెచ్‌వో కుడ్మెత మనోహర్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సుభాష్‌ రాథోడ్‌, డీఈ ప్రభాకర్‌, జిల్లా ఫైర్‌ అధికారి భగవాన్‌ రెడ్డి, టీజీఎంఐడీసీ ఈఈ రామ్‌కుమార్‌తో కలిసి విచారణ జరిపారు. మొదటి రోజు చేపట్టిన విచారణ వివరాలను నమోదు చేసుకున్నారు. అగ్ని ప్రమాదానికి కారణమైన ఏసీ పనితీరు, వైరింగ్‌ సామర్థ్యం, నిర్వాహణ, పర్యవేక్షణ లోపాలు, సాంకేతిక కారణాలు, భద్రత పరమైన నిర్లక్ష్యం వంటి వివిధ అంశాలపై విభిన్న కోణాల్లో విచారణ చేపట్టారు. వార్డులో ఉన్న పడకలు, చికిత్స పొందుతున్న చిన్నారులు, వారి ఆరోగ్య పరిస్థితి, అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది వంటి వివరాలను నమోదు చేసుకున్నారు. సేకరించిన వివరాలు, ఆధారాలతో సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement