ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ ఆస్పత్రి నిర్వహణ, పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని ఎంపీ నగేశ్ అన్నారు. రిమ్స్‌లోని ఎస్‌ఎన్‌సీయూ విభాగాన్ని శుక్రవారం పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తె లుసుకున్నారు. ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌తో పాటు పలు విభాగాలకు ఆర్‌వోలు లేరని, ఇటు ఆస్పత్రి, అటు మెడికల్ కళాశాలను ఒకే వ్యక్తి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, ఆస్పత్రి నిర్వాహణ వ్యవస్థ ను పటిష్టపర్చి పేదలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు రాజు, రమణ, నారాయణ, అరుణ్‌కుమార్, సదానందం, తదితరులున్నారు.


