ఆదిలాబాద్‌టౌన్: గణేశ్ నిమజ్జనోత్సవాలు ప్ర శాంతంగా సాగేలా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో వినా యక నిమజ్జనోత్సవానికి సంబంధించి పోలీసు అధికారులతో శుక్రవారం సమావేశం అయ్యా రు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీసీ కెమెరాల ద్వారా నిమజ్జన కార్యక్రమాలను పరిశీలిస్తూ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నిమజ్జన బందోబస్తు కోసం 600 మంది సిబ్బందిని మోహరించినట్లు పేర్కొన్నారు. పట్టణాన్ని 13 క్లస్టర్లు, 13 సెక్టార్లుగా విభజించి 23 పికెట్లతో పాటు రూఫ్‌టాప్ బందోబస్తు, హైవే పెట్రోలింగ్, రెండు ౖస్ట్రెకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 600 సీసీ కెమెరా లతో పాటు డ్రోన్ల ద్వారా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పెన్‌గంగా, చాంద(టి) నిమజ్జన ప్రదేశాల్లో ప్రత్యేక బందో బస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఇందులో అదనపు ఎస్పీలు పి.మౌనిక, బి.సురేందర్‌రావు, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి, డీఎస్పీలు ఎల్.జీవన్‌రెడ్డి, ఎం.వెంకటనర్సయ్య, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


