ఆదిలాబాద్‌టౌన్: అక్షరాస్యతే అభివృద్ధికి తొలిమె ట్టు.. చదువుతో సమాజంలో చైతన్యం వస్తుంది.. ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది.. అక్షరక్రమంలో ముందున్న ఆదిలాబాద్ జిల్లా అక్షరాస్యతలో మా త్రం ఇంకా వెనుకబడే ఉంది. సర్కారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆశించిన ఫలితాలు మాత్రం కానరావడం లేదు. జిల్లాను అక్షరాస్యతలో ముందుంచేందుకు ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని చేపడుతుంది. గతేడాది నుంచి జిల్లాలో అమలు చేస్తుంది. మరో నాలుగేళ్ల పాటు కొనసాగనుంది. అప్పటి వరకై నా లక్ష్యం నెరవేరుతుందా అనే చర్చ సాగుతోంది. గ్రామాలు, పట్టణాల్లోని మహిళా సంఘాల సభ్యులతో ఆయా కాలనీలు, వార్డుల్లో నిరక్షరాస్యులను గుర్తించి వారికి అక్షరాలు నేర్పిస్తున్నారు. అ యితే కొంత మంది మాత్రమే ముందుకొచ్చి అక్షరా లు దిద్దిస్తున్నారు. ఇటీవల ఎన్‌ఐవోఎస్ పరీక్ష నిర్వహించగా 12,532 మంది హాజరైనట్లు అధికా రులు చెబుతున్నారు. ఇందులో 8,536 మంది ఉత్తీ ర్ణులయ్యారు. మరోసారి ఈనెల 20న పరీక్ష నిర్వహించేందుకు వయోజనవిద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది.
1,27,491మంది నిరక్షరాస్యులు..
జిల్లాలో నిరక్షరాస్యులు లక్ష 27వేల 491 మంది ఉన్నట్లు వయోజన విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో పురుషులు 34,635 మంది ఉండగా, మహిళలు 82,827 మంది, ఇతరులు 29 మంది ఉన్నారు.
ఉల్లాస్ కార్యక్రమం ద్వారా..
జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ కార్యక్రమం చేపడుతున్నారు. గతేడాది అక్టోబర్ 27న కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి విడత జిల్లాలో 55 శాతం నిరక్షరా స్యులు 26,341 మందిని అక్షరాస్యులుగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. 14,186 మందిని ఎన్‌ఐఓఎస్ పరీక్ష రాయించేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 12,532 మంది పరీక్ష రాయగా, ఇందులో 8,536 మంది ఉత్తీర్ణులైనట్లు వయోజన విద్యాశాఖ అధికారులు తెలిపారు.


