ఆదిలాబాద్‌టౌన్: యువత కలలను సాకారం చేసే లా పోలీస్ శాఖ చేయూత అందిస్తుందని ఎస్పీ అఖి ల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణను సోమవారం జిల్లా కేంద్రంలోని డీటీసీలో ప్రా రంభించారు. శిక్షణ కోసం నిర్వహించిన పరీ క్షకు 3,500 మంది అభ్యర్థులు హాజరుకాగా, అందులో 300 మందికి పైగా ఎంపిక చేశారు. ఇందులో 100 మంది నిరుపేదలు, ఆదివాసీ యువతకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెంది న నిష్ణాతులైన శిక్షకులతో అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక పరీక్షలో ఉత్తీ ర్ణత సాధించిన వారికి తదుపరి దశలో డీటీసీ ప్రాంగణంలోనే ఉచిత భోజనం, వసతితో శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో అదనపు ఎస్పీ పి.మౌనిక, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, టూటౌన్ సీఐ కె.నాగరాజు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ డి.వెంకటి, రూరల్ ఎస్సై వి.విష్ణువర్ధన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఊరును బాగు చేసిన ఎస్పీకి కృతజ్ఞతలు
ఆదిలాబాద్‌రూరల్ మండలం చిట్యాలబోరిలో కల్తీ కల్లు, గుడుంబాలేకుండా చేయాలన్న గ్రామస్తుల తీ ర్మానం మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. దీంతో వారు ఎస్పీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ అనిత ఉన్నారు.


