కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం తప్పదు
ఆదిలాబాద్ పట్టణం బొక్కల్‌గూడకు చెందిన నయిముల్లాఖాన్ పుట్టుమూగ, చెవిటి. దివాంగుడైనా ప్రభుత్వపరంగా అందే ఆసరా పింఛన్ 2015లో నిలిచిపోయింది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అనే కారణంతో అధికారులు పింఛన్‌ను నిలిపివేశారు. అప్పటి నుంచి పునరుద్ధరించాలని కోరుతూ బాధితుడు అధికారులకు విన్నవిస్తూనే ఉన్నాడు. తోటి దివ్యాంగుడి బాధను గుర్తించిన మిగతా మూగ, చెవిటి దివ్యాంగులు ఆయనకు అండగా నిలిచారు. మిత్రుడి ఆవేదనను సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ సైగలు, పేపర్‌పై రాసి కలెక్టర్ రాజర్షిషాకు సోమవారం వివరించాడు. భార్య, ఇద్దరు పిల్లలు కలిగిన బాధితుడి పింఛన్‌ను పునరుద్ధరించాలని విన్నవించాడు. – కై లాస్‌నగర్
మిత్రుడికి అండగా తరలివచ్చిన సహచర దివ్యాంగులు (దరఖాస్తు పత్రం పట్టుకున్న వ్యక్తి నయిముల్లాఖాన్ )
పోలీసు వ్యవస్థ బాధితుల పక్షాన ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: బాధితుల పక్షాన పోలీసు వ్యవస్థ ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అధికారులకు సూచించారు. పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి 33 మంది తరలివచ్చి తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఫోన్ ద్వారా సంబంధిత అధి కారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతాయుతంగా విధులు చేపట్టాలి
పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అన్నారు. కోర్టులో నేరస్తులకు శిక్ష పడేలా సమర్థవంతంగా కృషి చేసిన కోర్టు డ్యూటీ అధికారులు రాహుల్, కె.స్వామిని పోలీసు కార్యాలయంలో అభినందించారు. ప్రశంసా పత్రాలతో పాటు రివార్డులను అందజేశారు.
ఆదిలాబాద్‌టౌన్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పా ర్టీతో పాటు సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజలే తగిన గుణ పాఠం చెబుతారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీ సుల వ్యవహారాన్ని నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. పట్టణంలో ని దస్నాపూర్ బ్రిడ్జివద్ద రాస్తారోకో చేపట్టారు. ప్ర భుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రి క్తత నెలకొంది. రాకపోకలునిలిచిపోయాయి. అనంతరం పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారని పేర్కొన్నారు. శాంతి యుతంగా నల్ల దుస్తులు ధరించి నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మెట్టు ప్రహ్లాద్, జగదీష్, రమేష్, రాజన్న, అజయ్, సతీశ్, ధమ్మపాల్, శివ, అనిల్, గణేశ్, భోజన్న, రమణ, వెంకన్న, అఖి లేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


