ఇంద్రవెల్లి: ఎస్‌ఐఆర్ ప్రక్రియ గడువులోపు పూర్తి చేయాలని ఉట్నూర్ సబ్‌కలెక్టర్ ప్రణ య్‌కుమార్ అన్నారు. ఇంద్రవెల్లి, శంకర్‌గూడ గ్రామాలను ఆదివారం సందర్శించారు. సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీ చేసిన ఓటర్ల నుంచి డాక్యుమెంట్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్‌వోలతో మాట్లాడి ఇప్పటి వరకు చేపట్టిన సర్వే, నోటీసుల జారీ, డాక్యుమెంట్ల స్వీకరణ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా వ్యహరించాలని, ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ వారి నుంచి డాక్యుమెంట్లను నిబంధనల ప్రకారం స్వీకరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, సర్పంచ్ జాదవ్ రోమ, వార్డు సభ్యులు జాదవ్ విజయ్‌కుమార్, బీఎల్‌వోలు ఉన్నారు.


