ఆదిలాబాద్: హైదరాబాద్‌లోని తెలుగు యూని వర్సిటీలో కల్చరల్ ఫైన్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ జాతీయస్థాయి నృత్య పోటీల్లో ఆదిలాబాద్ బాలకేంద్రం చిన్నారులు ప్రతిభ కనబరిచారు. సబ్‌జూనియర్ కూచి పూడి విభాగంలో మందోళ్ల మహాశ్విని, పడాల ధన్విక, ముమ్మడి శ్రీ ఆధ్య ద్వితీయ స్థానంలో నిలిచారు. సీనియర్ విభాగంలో వేల్పుల శ్రేష్ఠ, గన్న ఆశ్రిత, పందిరి శ్రేయాన్షి, సామ మహతి, క్షీరసాగర్ జాహ్నవి, కనిందే మహాశ్రీ, జంగలి రిధిక్ష, గడ్డం శ్రీనిధి, ఠాకూర్ హర్షిణి రెండో స్థానంలో నిలిచారు. సోలో విభాగంలో గడ్డం శ్రీనిధి ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. వీరంతా మలేషియాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికై నట్లు బాలకేంద్రం పర్యవేక్షకులు మిట్టు రవి తెలిపారు.


