నెల్లూరురూరల్: వైఎస్సార్‌సీపీ నెల్లూరు నగర మహిళా విభాగం అధ్యక్షురాలిగా రజని, అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలిగా మహేశ్వరి, ఆర్‌టీఐ విభాగం అధ్యక్షుడిగా నాగ శ్రీనివాసులురెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. వీరు సిటీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని సోమవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వారిని అభినందించి పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, నగర నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ధనుజారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


