నెల్లూరు / నెల్లూరురూరల్
సమస్యను కళ్లముందున్న అధికారులకు చెబితే పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు. అయితే కొందరి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వినతులు చేతపట్టుకుని ఎన్నిసార్లు వెళ్లినా తమకు భరోసా దక్కడం లేదని వృద్ధులు, దివ్యాంగులు, అవయవాలు కోల్పోయిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పలువురు బాధితులు తరలివచ్చారు. తమ ఇబ్బందులను అధికారులకు వివరించి వినతులు అందజేశారు. సమస్యను చెప్పుకొనేందుకు అవకాశం దొరికినా.. దాని పరిష్కారం కోసం మళ్లీ ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఎదురవుతోందని కొందరు వాపోయారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు


