గంజాయి, తెల్లకల్లు, దేశీదారు, ఇతర మా దకద్రవ్యాలకు బాని స అవుతున్న వారికి నెల రోజుల పాటు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. వైద్య సేవలతో పాటు సైకియాట్రిస్ట్‌తో సూచనలు అందిస్తున్నాం. చాలా మందిలో మార్పు వస్తుంది. ఈ ఏడాది మూడు నాలుగు నెలల్లో పది మంది మైనర్లు డి–అడిక్షన్ సెంటర్‌లో చేరారు. మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలను వారికి వివరిస్తున్నాం.
– దేవేందర్, డవ్ సెంటర్ నిర్వాహకుడు
భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు
యువత, మైనర్లు మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. గంజాయి బారిన పడినవారు ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్యం బారిన పడుతున్నారు. వారికి కౌన్సెలింగ్‌తో పాటు డి–అడిక్షన్ సెంటర్‌లో చేర్పిస్తున్నాం. 40 శాతం వరకు మార్పులు వస్తున్నాయి. భవిష్యత్తులో మళ్లీ వ్యసనాల బారిన పడకుండా సంబంధిత ఎస్సైల ద్వారా నిరంతరంగా నిఘా ఉంచుతున్నాం. ఎక్కడైన గంజాయి విక్రయించినా, సేవించినా పోలీసులకు సమాచారం అందించాలి. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.
– అఖిల్ మహాజన్, ఎస్పీ


