● మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ‘క్ర మశిక్షణ కమిటీ’ ఆదేశం
కై లాస్‌నగర్: కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డికి ఆ పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు ఆదిలాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఇజ్జగిరి సంజయ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 17న ఉట్నూర్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి సచిన్ సావంత్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో చోటుచేసుకున్న గొడవతోపాటు పార్టీ నాయకులను పరుషపదజాలంతో దూషించారనే కారణంతో ఈ నోటీసులు జారీ చేశారు. సీనియర్ నాయకుల సమక్షంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లుగా పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ తమ దృష్టికి తెచ్చిన ఈ విషయంపై నోటీసు జారీ చేసినట్లుగా పేర్కొన్నారు. దీనిపై మూడు రోజుల్లో గా వివరణ ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ వైస్ చైర్మన్ ఏ.శ్యాంమోహన్ పేర్కొన్నారు. వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మా సారు.. మాక్కావాలే!
ఆదిలాబాద్(బేల): తమకు విద్యాబుద్ధులు నేర్పుతూ, ఎంతో శ్రద్ధగా బోధిస్తున్న ఉపాధ్యాయుడిని వేరే పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ‘మా సారు మాకు కా వాలి’ అంటూ బుధవారం నిరసనకు దిగారు. బేల మండలంలోని బెదోడ ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణను ఇటీవల విద్యాశాఖ అధికారులు మౌఖిక ఆదేశాలతో కాంగార్‌పూర్ పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపించారు. దీంతో వి ద్యార్థులు, వారి తల్లిదండ్రులు బుధవారం పా ఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు స్పందించి సదరు ఉపాధ్యాయుడిని తిరిగి బెదోడ పాఠశాలకు పంపించారు. చిన్నారులు హర్షం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయుడికి స్వాగతం పలికారు.


