నైపుణ్యాభివృద్ధికి శిక్షణ దోహదం | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాభివృద్ధికి శిక్షణ దోహదం

Aug 20 2026 2:52 AM | Updated on Aug 20 2026 2:52 AM

ఆదిలాబాద్‌టౌన్‌: నైపుణ్యాభివృద్ధికి ఓరియంటేషన్‌ ఎంతగానో దోహద పడతాయని డీఐఈవో జాదవ్‌ గణేశ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల లెక్చరర్లకు జిల్లా కేంద్రంలో నిర్వహించిన రెండు రోజుల ఓరియంటేషన్‌ను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధునాతన పద్ధతులు, మెళకువలు పాటిస్తూ సాంకేతిక పరిజ్ఞానం సమర్థవంతంగా వినియోగించుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని సూచించారు. రిసోర్స్‌ పర్సన్స్‌ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా అకాడమిక్‌ మానిటరింగ్‌ కమిటీ అధికారి కె.నాగరాజు, డీఆర్‌పీలు కె.లక్ష్మణరావు, శ్రీనివాస్‌, శివకుమార్‌, నాగేశ్వర్‌, ఉదయ్‌కుమార్‌, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement