ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ కింద జిల్లాలోని నాలుగు కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌ల కోసం నిధులు మంజూరు చేసింది. ఒక్కో కళాశాలకు రూ.25లక్షల చొప్పున కేటాయించింది. ప్రైవేట్, కార్పొరేట్‌కు ధీటుగా సర్కారు కళాశాలల్లో నా ణ్య మైన విద్యాబోధన అందుతుంది. అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఫలితాలపై దృష్టి సారిస్తున్నాం. కంప్యూటర్ పరిజ్ఞానంతో విద్యార్థుల నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయి.
– జాదవ్ గణేశ్‌కుమార్, డీఐఈవో


