‘సీసీఐ ఉద్యమంపై విషం చిమ్మొద్దు’ | - | Sakshi
Sakshi News home page

‘సీసీఐ ఉద్యమంపై విషం చిమ్మొద్దు’

Aug 15 2026 12:28 AM | Updated on Aug 15 2026 12:28 AM

ఆదిలాబాద్‌టౌన్‌: మూతపడిన సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించాలని చేపట్టిన ప్రజా ఉద్యమంపై బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ విషం చిమ్మడం మా నుకోవాలని సీసీఐ సాధన కమిటీ కోకన్వీనర్‌ విజ్జగిరి నారాయణ అన్నారు. శుక్రవారం దీక్ష శిబిరంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌, 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ మూతపడిన సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. దీక్షలో అంకోలి గ్రామస్తులు కూర్చున్నారు. కార్యక్రమంలో సాధన కమిటీ కోకన్వీనర్లు కొండ రమేశ్‌, బండి దత్తాత్రి, పోశెట్టి, దాసరి రమేష్‌, అరుణ్‌ కుమార్‌, చిలుక దేవిదాస్‌, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement