సాక్షి,ఆదిలాబాద్: సొసైటీకి మార్క్‌ఫెడ్ ద్వారా వచ్చే ఎరువుల లోడ్‌కు సంబంధించి ఇదివరకు ప్రభుత్వమే రవాణా చార్జీలు భరించేది. తాజాగా దీన్ని ఎత్తివేసింది. ఫలితంగా ఎరువు ధరతో పాటు రైతుపై అదనంగా ట్రాన్స్‌పోర్టు భారం పడుతుంది.
బస్తాపై రూ.32 వరకు..
ఎరువులను సొసైటీలు, ఆగ్రోస్ సేవ కేంద్రాలు, ప్రైవేట్ దుకాణాల ద్వారా విక్రయిస్తుంటారు. మార్క్‌ఫెడ్ ద్వారా పీఏసీఎస్‌లకు లోడ్ సరఫరా జరుగుతుంది. ఇదివరకు ఈ భారాన్ని ప్రభుత్వమే భరించేది. ఇటీవల ఆన్‌లైన్ యాప్‌లో ఎరువుల బుకింగ్, విక్రయాలను పూర్తి స్థాయిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో పాటు రవాణా చార్జీలను రైతుపైనే మోపింది. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్.. ఇలా అన్ని ఎరువులపై ఈ రవాణా భారం రైతే భరించాల్సి వస్తోంది. గరిష్ట రవాణా చార్జీలు రూ.20 వరకే ఉన్నట్లు మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. నేరడిగొండలో ఏకంగా ఒక్కో బస్తాపై రూ.32లకు పైగా వసూలు చేస్తుండడం గమనార్హం.
దూరాన్ని బట్టి భారం..
జిల్లా కేంద్రం నుంచి నేరడిగొండ సుమారు 50 కి లోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇటీవల ఆ సొసైటీకి 444 బ్యాగ్‌ల యూరియా లోడ్‌తో వాహనం వ చ్చింది. ప్రస్తుతం రైతులు కొనుగోలు చేస్తుండగా, ఒక్కొక్కరి వద్ద నుంచి బ్యాగ్‌కు రవాణా చార్జీ కింద రూ.32.57 పైసలు వసూలు చేస్తున్నారు. ఈ సొ సైటీకి వచ్చిన ఆ బ్యాగులన్నీ విక్రయిస్తే రవాణా చా ర్జీ కింద రైతులపై రూ.14,460 భారం పడుతుంది.
నెల క్రితం నుంచే..
సొసైటీ నుంచి ఎరువులను తీసుకునే రైతు రవాణా చార్జీ కూడా చెల్లించాలి. ఇది నెల కిందటి నుంచే అమలైంది. దూరభారాన్ని బట్టి ఒక్కో బ్యాగ్‌పై కనిష్టంగా రూ.8 నుంచి గరిష్టంగా రూ.20 వరకు చెల్లించాలి.
– మహేశ్‌కుమార్, డీఎం, మార్క్‌ఫెడ్


