రాజువయ్యా! | - | Sakshi
Sakshi News home page

రాజువయ్యా!

Aug 15 2026 12:28 AM | Updated on Aug 15 2026 12:28 AM

జనం మెచ్చిన..‘రాజ’పాలన

ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర

ఏడాది క్రితం 100 మందికి పైగా రైతులు పత్తిపంటను సీసీఐకి విక్రయించారు. అందుకు సంబంధించిన డబ్బులు వారి పోస్టల్‌ ఖాతాల్లో జమకాగా వాటిని పోస్టల్‌ అధికారి తన సొంతఖాతాకు మళ్లించుకుని దుర్వినియోగం చేశాడు. బాధిత రైతులు కలెక్టర్‌కు విన్నవించగా ప్రత్యేక చొరవ చూపారు. రూ.3కోట్లకు పైగా డబ్బులను త్వరితగతిన ఇప్పించారు.

ఇచ్చోడ మండలం ముఖరా(బి) గ్రామానికి వెళ్లిన కలెక్టర్‌ను స్థానిక ఆటోడ్రైవర్‌ మోహితే సంతోష్‌–పూజ దంపతులు కలిశారు. తలసేమియా బాధపడుతున్న తమ కూతురు శివాంగి బోన్‌న్యూరో మార్పిడి సమస్యను నివేదించారు. పాప కు బెంగూళూరులో చికిత్స అవసరమని ఆదుకో వాలని కోరారు. స్పందించిన కలెక్టర్‌ రూ.50వేల ఆర్థికసాయం అందించారు. ఆ సాయంతో పాప చికిత్స విజయవంతం కాగా ఆ దంపతులు ప్రజావాణిలో కలెక్టర్‌ను సన్మానించి తమ కృతజ్ఞత చాటుకున్నారు.

భీంపూర్‌ మండలం నిపాని గ్రామానికి చెందిన క్యాన్సర్‌ బాధితుడు రాకేశ్‌ తల్లిదండ్రులు గ్రీవెన్స్‌లో సమస్యను విన్నవించగా.. స్పందించిన కలెక్టర్‌ రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు.

భీంపూర్‌ మండలం గోల్లఘాట్‌ గ్రామానికి చెందిన మాడవి గంగారాం అనే రైతుకు దీర్ఘకాల భూ సమస్యను పరిష్కరించి పట్టా అందజేశారు.

సాత్నాల మండలం మేడిగూడకు చెందిన రైతు భావనే పార్వతిబాయి 50ఏళ్ల భూసమస్యను కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో పరిష్కరించారు. దీంతో ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

డైట్‌ కళాశాల ఆవరణలోని ప్రత్యేకావసరాలు గల పిల్లలకు ఏఐతో కూడిన బోధన అందించేందుకు రూ.4.90లక్షలతో పరికరాలను కొనుగో లు చేయించారు. రణదీవేనగర్‌ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాలకు రూ.10లక్షలు కేటాయించి ఇటీవల పూర్తి చేయించారు.

ప్రభుత్వబడుల్లోని 10,116మంది బాలికలకు ఓ ఎన్జీవో సహకారంతో న్యాప్‌కిన్స్‌ అందజేశారు.

జిల్లాలోని వివిధ గ్రామాల రోడ్లకు, ప్రభుత్వ బ డుల నిర్వహణ మరమ్మతులు, మౌలిక వసతుల కోసం రూ.5కోట్ల వరకు నిధులు కేటాయించా రు. ఎన్నో బడులు బాగుపడ్డాయి. చాలా రోడ్లు మెరుగయ్యాయి.

జిల్లాలోని 276 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వి ద్యార్థుల్లో ఆంగ్ల నైపుణ్యం పెంపొందించేలా ఇటీవల స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కార్యక్రమానికి శ్రీకారం చు ట్టారు. ప్రత్యేక నిధులు విడుదల చేసి నిపుణులైన ఉపాధ్యాయులతో బుక్‌లెట్‌లు సిద్ధం చే యించారు. త్వరలోనే శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి.

ఆదిలా‘బాదలు’ వింటూ.. అండగా ఉంటూ

అవును నిజమే.. ఆయన పేరుకు తగ్గట్లుగా రాజయ్యాడు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. గోడు వింటూ.. గోస తీరుస్తూ.. జనం మెచ్చిన పాలకుడయ్యాడు. అంతేకాదు ఆరాధ్యదైవంగా మారిపోయాడు. ఇప్పటి వరకు ఆదిలాబాద్‌ కలెక్టర్లుగా ఎంతో మంది పనిచేసినా తన పేరును మాత్రం గూడెం గుండెలో భద్రపరుచుకున్నాడు. గ్రీవెన్స్‌కు పెద్దపీట వేస్తూ ఆదర్శంగా నిలిచాడు. ఆయనే జిల్లా బాస్‌ రాజర్షి షా.

జిల్లా అభివృద్ధే లక్ష్యం

జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. విద్య, వైద్యం, రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూస్తున్నాం. గ్రీవెన్స్‌కు ప్రా ధాన్యం ఇస్తూ ప్రజా సమస్యల పరిష్కారాని కి పాటుపడుతున్నాం. జాతీయ స్థాయిలో అందిన అవార్డులు బాధ్యతను మరింత పెంచాయి. ఇప్పటికే ఆరోగ్య పాఠశాల ద్వారా మంచి ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంచేలా స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు చేపడుతున్నాం. ఓ వైపు పాలనలో అన్ని విధాలా సహకరిస్తున్న యంత్రాంగం, మరోవైపు ప్రజలు చూపుతున్న అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను.

– రాజర్షి షా, కలెక్టర్‌

అభివృద్ధికి బాట.. గ్రీవెన్స్‌కు పెద్ద పీట

జిల్లాపై రాజర్షి షా మార్కు

కలెక్టర్‌ను కలిస్తే పని అయినట్లే..

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జనం సమస్యలను ఓపిగ్గా వింటూ సంబంధిత అధికారులతో ఫోన్‌లో, ప్రత్యక్షంగా మా ట్లాడి వాటిని పరిష్కరించేలా చొరవ చూపుతున్నారు. పెద్దసారును కలిస్తే తమ సమస్యలు తీరుతాయనే నమ్మకాన్ని పెంపొందించుకుంటున్నారు. ఏదైనా ఓ వారం కలెక్టర్‌ అందుబాటులో లేకుంటే అర్జీలతో వచ్చిన వారు వాటిని ఇవ్వకుండానే వెనుదిరుగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కై లాస్‌నగర్‌: మార్చి 6, 2024న ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా రాజర్షి షా బాధ్యతలు స్వీకరించారు. క్రమంగా ఏజెన్సీ జిల్లాపై పట్టు సాధించారు. ప్రజావాణికి ప్రాధాన్యం ఇస్తూ జనం గోడుకు పెద్ద పీట వేశారు. ప్రతీ సోమవారం వారి సమస్యలను సావధానంగా వింటూ పరిష్కార మార్గం చూపారు. అంతేకాదు.. అట్టడుగున ఉన్న నార్నూర్‌ మండలాన్ని అభివృద్ధి బాట పట్టించారు. ఈ ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ను దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపారు. ‘ఆరోగ్య పాఠశాల’తో విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేసి జాతీయస్థాయిలో స్కోచ్‌ అవార్డు అందుకున్నారు. జలసిరితో బొట్టుబొట్టు ఒడిసి పట్టి ‘జలసంచా య్‌.. జన భాగీధారి’ సత్కారం పొందారు. విద్య, పోషణ, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధికి గాను నీతి ఆయోగ్‌ ప్రశంసలందుకున్నారు. ఆది కర్మ యోగి ధరిత్రి ఆబా జన భాగిధారి కార్యక్రమాలను అమలు పరిచి ఉత్తమ జిల్లాగా కేంద్రం నుంచి ప్రత్యేక గుర్తింపు దక్కేలా చొరవచూపారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్‌ వంటి ప్రముఖుల చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. సేవాభావంతో కూడిన పాలన అందిస్తూ ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. తమకు గూడు దక్కేలా చూపిన చొరవకు ఆ గూడెం హర్షించింది. కాళ్లు కడిగి.. ఆరాధ్యదైవంగా భావించిన ఆదివాసీలు ఏకంగా తమ గ్రామానికి ‘రాజర్షి షా గూడ’గా గురువారం నామకరణం చేసుకోవ డం గమనార్హం. పంద్రాగస్టు నేపథ్యంలో జిల్లా బాస్‌ మార్కు పాలనలో ప్రత్యేకతలు..

మచ్చుకు కొన్ని..

ఆదివాసీ సంప్రదాయబద్ధంగా గురువారం కలెక్టర్‌ కాళ్లు కడిగి స్వాగతం పలుకుతున్న ఇందిరమ్మ లబ్ధిదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement