పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం

Aug 15 2026 12:28 AM | Updated on Aug 15 2026 12:28 AM

కై లాస్‌నగర్‌: పంద్రాగస్టు వేడుకలకు జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పోలీసుల కవాతు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు వీలుగా మైదానాన్ని చదును చేసి రంగువల్లులతో తీర్చిదిద్దారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ప్రాంతంతోపాటు ముఖ్య అతి థులు ఆసీనులయ్యే వేదికను, జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, అధికారులు, మీడియా ప్రతినిధులు కూర్చునేందుకు వీలు గా ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి తెలియజేసేలా స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు గాను శాఖల వారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొననున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ షబ్బీర్‌ అలీ శుక్రవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు స్థానిక పెన్‌గంగ గెస్ట్‌హౌస్‌ లో కలెక్టర్‌ రాజర్షిషా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌లు పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఆయన ఉద యం 9.30 గంటలకు జాతీయ పతాకావిష్కరణ అనంతరం పోలీసుల నుంచి గౌరవవంద నం స్వీకరిస్తారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. పాఠశాలల వి ద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement