ఆటలతో బలపడనున్న స్నేహ సంబంధాలు | - | Sakshi
Sakshi News home page

ఆటలతో బలపడనున్న స్నేహ సంబంధాలు

Aug 14 2026 7:32 AM | Updated on Aug 14 2026 7:32 AM

ఆదిలాబాద్‌: ఆటలతో స్నేహ సంబంధాలు బలపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. స్వాతంత్య్ర ది నోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. ప్రభాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజ రై టాస్‌ వేసి మ్యాచ్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. నిత్యం కేసుల ఒత్తిడిలో విధులు నిర్వహించే న్యాయ శాఖ ఉద్యోగులు, న్యాయవా దులకు క్రీడలు మానసిక ప్రశాంతతను అందిస్తాయని పేర్కొన్నారు. ఆరో గ్యం కోసం యోగా, ధ్యానంతో పాటు ఆటలకు కూడా స మయం కేటాయించాలని సూచించారు. న్యా యమూర్తులు హుస్సేన్‌ నాయక్‌, దివ్యవాణి, తేజస్విని, న్యాయశాఖ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement