కై లాస్‌నగర్: జిల్లా అభివృద్ధికి చేపడుతున్న చ ర్యలను చూసి ఓర్వలేకే మాజీ మంత్రి జోగు రా మన్న రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. సీసీఐ పు నరుద్ధరణ పేరిట కొత్త నాటకానికి తెర లేపార ని ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలో ని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పని చేసిన జోగు రామన్నకు సీసీఐ పునరుద్ధరణ, ఇండస్ట్రియల్ కారిడార్ ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. కేంద్రం నిధులు మంజూరు చేసి జీవో జారీ చేస్తే రాష్ట్ర వాటా కింద రూ.250 కోట్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సి ద్ధంగా ఉందని చెప్పారు. ఇప్పటికై నా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.


