ఆదిలాబాద్: జాతీయ సమైక్యతను చాటి చెప్పేలా స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మానంద్ మాట్లాడుతూ.. ఈ నెల 14న ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చా టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు పాయల శరత్, జోగు రవి, దినేశ్ మటోలియా, బోడిగం శ్రీకాంత్, లాలా మున్నా, మనోహర్, గంట జీవన్, దేవారావు తదితరులు పాల్గొన్నారు.


