రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలి

Aug 14 2026 7:32 AM | Updated on Aug 14 2026 7:32 AM

ఆదిలాబాద్‌: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని డీవైఎస్వో దయానందరెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని స్విమ్మింగ్‌ పూల్‌లో ఎస్జీఎఫ్‌ ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి స్విమ్మింగ్‌ పో టీలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీ డలపై ఆసక్తి పెంచుకోవాలని, నిరంతరం సాధన చేస్తూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలి పారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారులు మరింత పట్టుదలతో శిక్షణ పొందాలని సూచించారు. డీటీఎస్వో పార్థసారథి, ఎస్జీఎఫ్‌ సెక్రటరీ రామేశ్వర్‌, స్విమ్మింగ్‌ పూల్‌ నిర్వాహకుడు రాష్ట్రపాల్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement