పనుల్లో నాణ్యత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

పనుల్లో నాణ్యత పాటించాలి

Aug 14 2026 7:32 AM | Updated on Aug 14 2026 7:32 AM

ఇంద్రవెల్లి: పనుల్లో నాణ్యత పాటించాలని నీటి పారుదల శాఖ క్వాలిటీ కంట్రోల్‌ ఎస్‌ఈ ప్రకాశ్‌ జాదవ్‌ సూచించారు. గురువారం మండలంలోని ముత్నూర్‌ త్రివేణి సంఘం చెరువును సందర్శించారు. మత్తడి మరమ్మతు పనులు, ఎత్తి పోతల పథకంలో ఏర్పాటు చేయనున్న పంప్‌ హౌస్‌ స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కోసం రూ.65 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు పనులను పర్యవేక్షిస్తూ నాణ్యత లోపించకుండా చూడాలని సూచించారు. ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ జగదీశ్‌, ఎస్‌ఈ ప్రభు కళ్యాణ్‌, క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ గోవర్ధన్‌, డీఈ లత, ఈఈ నరేశ్‌, ఏఈ ప్రవీణ్‌కుమార్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement