ఇచ్చోడ: కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి మహోత్తర పథకాలు ఇప్పటికీ పేదింటి ఆడపడుచులకు అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 42 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబా రక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇమ్రాన్, ఎంపీడీవో నరేశ్, బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, సర్పంచ్ జలైజాకు, ఉపసర్పంచ్ శిరీష్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు సుభాష్, పాండురంగ్, వివిధ గ్రామల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.


