నేడు ‘యువజన పోరు గర్జన’ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘యువజన పోరు గర్జన’

Aug 11 2026 11:58 PM | Updated on Aug 11 2026 11:58 PM

ఆదిలాబాద్‌టౌన్‌: సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే యత్నాలను బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే మానుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజుకు చేరాయి. మంగళవారం నాటి దీక్షలో యాపల్‌గూడ గ్రామస్తులు కూర్చొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుధవారం నిర్వహించనున్న విద్యార్థి, యువజన పోరు గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. విద్యార్థులు, యువత, రైతులు, కూలీలు, మేధావులు, కుల, ప్రజా సంఘాల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మల్లేశ్‌, నారాయణ, అలాల్‌ అజయ్‌, సలీం, రమేష్‌, బొర్రన్న, కిరణ్‌, శివ, రమేశ్‌, చిన్నన్న, రాజ్‌, భూమయ్య, కాంతారావు, గంగారాం, షేక్‌ షఫీ, రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement