ఆదిలాబాద్: గిరిజన, మారుమూల ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపరచాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను స్థానిక ఎంపీ గోడం నగేశ్ కోరారు. మంగళవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని గిరిజన, మారుమూల ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు ఎంపీ తెలిపారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం–జన్‌మన్), ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎం–జీఎస్‌వై) కింద చేపట్టాల్సిన పలు రహదారి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రమంత్రికి సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.


